Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారికి ఏ సేవ చేయాలన్నా సరే... ఆన్ లైన్లో 50 వేల టికెట్లు... నేటి నుంచి అమ్మకం

తిరుమల శ్రీవెంకటేశ్వరుని సేవలకు సంబంధించి 50 వేల టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఉంచింది. నేటి ఉదయం 11 గంటల నుంచి 'టీటీడీ సేవా ఆన్ లైన్' వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. ఏప్రిల్ నెలలో ఏ రోజైనా సేవ చేసేందుకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. సుప్రభాత సేవకు సంబంధించి 115, తోమాల సేవ 120, అర్చన 120, విశేషపూజ 1,500, అష్టదళ పాదపద్మారాధన సేవకు 40, నిజపాద దర్శనం 1125, కల్యాణం 9,750, ఊంజల్ సేవ 2,600, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,590, వసంతోత్సవం 10,320, సహస్ర దీపాలంకార సేవకు 12,350 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది.

More Telugu News